Kalpana Soren | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకురాలు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సతీమణి కల్పనా సోరెన్ (Kalpana Soren) గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గం (Gandey Assembly constituency) నుంచి పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట పలువురు పార్టీ నేతలు ఉన్నారు.
కాగా, మనీలాండరింగ్ కేసులో తన భర్త, సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్‌తో ఈ ఏడాది మార్చిలో కల్పనా సోరెన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో గాండేయ్ స్థానం నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. గాండేయ్ ఎమ్మెల్యే (జేఎంఎం) సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై కల్పనా సోరెన్ 27 వేల ఆధిక్యంతో గెలుపొందారు. ఇప్పుడు అదే స్థానం నుంచి పోటీకి దిగారు.
81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి (Jharkhand Assembly Elections) రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనుండగా.. మిగిలిని 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది.
#WATCH | Giridih, Jharkhand: Kalpana Soren, JMM leader and wife of Jharkhand CM Hemant Soren files her nomination as party candidate from Gandey Assembly constituency. #JharkhandAssemblyElections2024 pic.twitter.com/uLddwr5lf7
— ANI (@ANI) October 24, 2024
Also Read..
Trash balloons | సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయంపై పడిన చెత్త బెలూన్
IIT Bombay: మున్నీ బద్నామ్ సాంగ్‌పై బాంబే ఐఐటీ విద్యార్థుల డ్యాన్స్.. వీడియో
Nandamuri Kalyan Ram | ‘NKR21’ కోసం వైజాగ్‌కి కళ్యాణ్ రామ్