NKR21 | డెవిల్ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ NKR21. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అలా ఎలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అశోక క్రియేషన్స్‌కు ఇది రెండో సినిమా. అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా షూటింగ్ కోసం టీమ్ అంతా వైజాగ్ వెళ్లినట్లు ప్రకటించింది. వైజాగ్‌లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ ప్రారంభించగా.. ఇందులో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటుందని.. ఈ 15 రోజుల షెడ్యూల్లో టీమ్ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వైజయంతి ఐపీఎస్ అనే పాత్రలో రాములమ్మ ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోంది.
#NKR21 moves to Vizag 💥
Team begins shooting for an important schedule in Vizag with all the primary cast taking part in it.
The team will can key scenes in this 15-day schedule.@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981 #AshokMuppa… pic.twitter.com/5BdNR6qCsJ
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 24, 2024