J&K Election Phase-2 | జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 25లక్షలమందికిపైగా ఓటర్లు ఓటు వేశారు. రెండో శ్రీనగర్ జిల్లాలోని ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరిగింది. రియాసిలో ఆరు, బుద్గామ్‌లో ఐదు, రియాసి, పూంచ్ జిల్లాల్లో మూడు చొప్పున, గందర్బల్లో రెండు స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు జమ్మూ కశ్మీర్లో 54 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసి జిల్లాలో 71.81 శాతం ఓటింగ్ నమోదు కాగా, శ్రీనగర్ జిల్లాలో అత్యల్పంగా 27.31 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. ఇంతకు ముందు 18న జరిగిన తొలి దశలో 61.38 శాతం ఓటింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే. అత్యధికంగా కిష్త్వార్ జిల్లాలో 80.20 శాతం ఓటింగ్ జరగ్గా.. అత్యల్పంగా పుల్వామా జిల్లాలో 46.99 శాతం ఓటింగ్ నమోదైంది.