రాంచీ: నదీతీర ప్రాంత ప్రజలకు వర్షాకాలంలోనూ వైద్య సేవలు అందేలా జార్ఖండ్ సర్కారు బోటు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. ఒక్కో బోటుకు రూ.29. 17 లక్షలు ఖర్చు చేసి, రెండు బోట్లను సిద్ధం చేసింది.
ఈ బోటులో ఆక్సిజన్ సిలిండర్, ఈసీజీ యంత్రం, రోగి కోసం క్యాబిన్, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఈ బోట్లు గంగానది తీరప్రాంతంలో ఉన్న డైరా పరిధిలో నివాసముంటున్న 2 లక్షల మందికి ఉపయోగపడనున్నాయి.