Lok Sabha speaker : లోక్‌సభ స్పీకర్ పదవిపై జేడీ(యూ) ప్రతినిధి కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జేడీయూ ఎన్డీయేతోనే ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రతిపాదించిన స్పీకర్ నియామకానికి తాము మద్దతు ఇస్తామని చెప్పారు.
మరోవైపు నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి కొద్ది గంటలైనా కాకముందే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో పదవుల పంపకాలపై అసమ్మతి మంటలు ఎగిసిపడిన సంగతి తెలిసిందే.
తమకు క్యాబినెట్ ర్యాంక్ ఆఫర్ చేయకపోవడంపై ఎన్సీపీ (అజిత్ వర్గం) మండిపడగా, శివసేన సైతం తమకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని రుసరుసలాడింది. మరోవైపు బిహార్‌కు ప్రత్యేక హోదాతో పాటు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, యూసీసీపై ఏకాభిప్రాయం సాధించాలని బీజేపీపై జేడీయూ ఒత్తిడి పెంచుతున్నది.
Read More :
Love Me | సైలెంట్‌గా ఓటీటీలోకి లవ్మీ.. ఇంతకీ ఏ ప్లాట్ఫాంలోనంటే..?