Love Me | టాలీవుడ్ యాక్టర్ ఆశిష్ (Ashish) కాంపౌండ్ నుంచి వచ్చిన హార్రర్ లవ్ థ్రిల్లర్ ‘లవ్మీ’ (Love Me). ‘ఇఫ్ యు డేర్’ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రాన్ని అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేశాడు. బేబి ఫేం వైష్ణవి చైతన్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. మే 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మూడు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో వీక్షించే వీలులవ్ మీ సైలెంట్‌గా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెన్స్‌గా ఓటీటీలోకి వచ్చిన లవ్ మీ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తుందనేది చూడాలి.
ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది..? ఏమవుతుంది..? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లవ్ మీ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగమల్లిడి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి పీసీ శ్రీరామ్ కెమెరామెన్ కాగా.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.