INDIA Bloc | ఆ భేటీలు ఛాయ్, సమోసాలకే పరిమితం : విపక్ష ఇండియా కూటమిపై జేడీయూ సెటైర్లు
సీట్ల పంపిణీ తేలేవరకూ విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) భేటీలు ఛాయ్, సమోసాకే పరిమితమవుతాయని జేడీ(యూ) నేత సునీల్ కుమార్ పింటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
పట్నా : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో ప్రధాని నరేంద్ర మోదీపై జేడీ(యూ) నేత ప్రశంసలు గుప్పించి వివాదానికి తెరలేపారు. సీట్ల పంపిణీ తేలేవరకూ విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) భేటీలు ఛాయ్, సమోసాకే పరిమితమవుతాయని జేడీ(యూ) నేత సునీల్ కుమార్ పింటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రధానిపై తాను ప్రశంసలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ హిందీ రాష్ట్రాలు మోదీ పట్ల విశ్వాసం కనబరిచాయని, తాను వాస్తవాలే మాట్లాడానని అన్నారు.
ప్రజల అభిమతాన్ని మనం అర్ధం చేసుకుని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన వ్యూహాలను రూపొందించుకోవాలని ఆయన సూచించాచు. తాను బీజేపీతోనే ఉంటానని, తన హృదయం కాషాయ పార్టీతోనే ఉంటుందని పింటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ పంపితేనే జేడీ(యూ)లోకి వచ్చానని, తమ నేత బిహార్ సీఎం నితీష్ కుమార్ కోరిన వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ ఎన్నికల నినాదాన్ని ప్రశంసించిన అనంతరం బిహార్‌లో జేడీయూ నేత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం అనంతరం సీతామర్హి ఎంపీ పింటూ చేసిన వ్యాఖ్యలు విపక్ష ఇండియా కూటమిలోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
Read More :
Animal Movie | సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్‌బీర్.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిన ‘యానిమల్’
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

