Animal Movie | సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్‌బీర్.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిన ‘యానిమల్’
Animal Movie | బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’(Animal) మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. మొదటిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది.
Animal Movie | బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’(Animal) మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. మొదటిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం 500 కోట్ల క్లబ్లో చేరింది.
ఇక ‘యానిమల్’ వారం రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. వరల్డ్‌వైడ్‌గా రూ.527 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ.285కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ వారీగా చూస్తే.. హిందీలో రూ.250 కోట్లు, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం కలిపి మొత్తంగా రూ.33 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.
#Animal Explosion Continues 🔥🪓#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalInCinemasNow #AnimalTheFilm #AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/bUGFLPhH1n
— Animal The Film (@AnimalTheFilm) December 7, 2023
రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) దర్శకత్వం వహించాడు. ఇక అర్జున్ రెడ్డి (Arjun reddy), కబీర్ సింగ్‌లతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన సందీప్.. యానిమల్ అంటూ రావడంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి.
ఈ సినిమా కథలోకి వెళితే.. విజయ్ (రణబీర్‌కపూర్) నాన్న పిచ్చోడు. చిన్నప్పట్నుంచీ తండ్రి అంటే అలవిమాలిన ప్రేమ. నాన్నే అతని ఓ సూపర్‌హీరో. కానీ తండ్రి నుంచి మాత్రం అతను ఆశించిన ప్రేమ దక్కదు. అయినా సరే నాన్నంటే మాత్రం పిచ్చి. తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. తనవాళ్లకు ఏమైనా చిన్న సమస్య వచ్చినా వైల్డ్‌గా రియాక్టవుతుంటాడు. ఆ కారణంచేత తండ్రి కోపానికి గురవుతుంటాడు. ఇంట్లోవాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరమైన విజయ్, కొన్నాళ్ల తర్వాత భార్యాపిల్లలతో కలిసి తన ఇంటికి చేరుకుంటాడు. అప్పడే తెలుస్తుంది అతనికి తన తండ్రి ఆపదలో ఉన్నాడని. తన తండ్రిపై జరిగిన హత్యాప్రయత్నం గురించి తెలుసుకొని, దీనికి కారణమైన వాళ్లను వెతికి చంపాలనుకుంటాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? అనుకున్నది ఎలా సాధించాడు? నాన్న ప్రేమను ఎలా పొందాడు? అనేది మిగితా కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

