Viral Video | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీ.. పల్టీలు కొడుతూ దాదాపు 300 మీటర్ల లోతు గల లోయలో పడిపోయింది. సిమ్లా జిల్లాలోని జాబ్లీలో ఐదో నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, ఈ ఘటనలో గాయపడిన జేసీబీ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో రోడ్డు ధ్వంసం కావడంతో ఎన్‌హెచ్ 5పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రోడ్డు పునరుద్ధరణ పనులను వేగంగా మొదలుపెట్టి.. ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.
शिमला के कुमारसैन में सड़क से मलबा हटाते समय जेसीबी खाई में गिरी, चालक की मौके पर ही हुई मौत।#himachalnews #shimla #monsoonupdate #jcb #jcbaccident pic.twitter.com/PHs6oXuKbl
— DD News Himachal (@DDNewsHimachal) August 2, 2025