చరిత్రలో ఈరోజు: లోకనాయకుడు.. జయప్రకాశ్ నారాయణ్ జననం
Today History : స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ 1902 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. జేపీగా సుప్రసిద్ధులైన ఈయన...

(Today History) స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ 1902 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. జేపీగా సుప్రసిద్ధులైన ఈయన లోకనాయకుడిగా పేరుగాంచారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వడం ద్వారా చిరస్మరణీయుడయ్యారు. ఈయన జయంతిని ప్రభుత్వం ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దినం’గా ప్రకటించి నిర్వహిస్తున్నది.
బీహార్‌లోని సితాబ్దియారాలో 1902 అక్టోబర్ 11న జేపీ జన్మించారు. ఉన్నత పాఠశాల విద్య పాట్నాలో సాగింది. 1920లో గాంధీ పాట్నా వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసాలకు ప్రభావితుడయ్యారు. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లి.. ఏడేండ్లు అక్కడే ఉండి బీఏ, ఎంఏ పట్టా పొందారు. 1929లో తిరిగి భారతదేశం వచ్చారు. మెట్రిక్ చదివే రోజుల్లోనే ప్రభావతి దేవితో వివాహం జరిగింది. జయప్రకాష్ అమెరికా నుంచి వచ్చాక జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనలో కమ్యూనిస్టు భావాలు, కారల్‌మార్క్స్ సిద్ధాంతాలు ఎక్కువగా ఉండేవి. కాంగ్రెస్‌లో ఉంటూనే సమాంతరంగా సాగిన సోషలిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు.
స్వాతంత్ర్యానంతరం ఆచార్య నరేంద్ర దేవ్, బాసవన్ సింగ్ మొదలైన వారితో కలసి కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన జేపీ.. సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీగా మారి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించింది. 1954లో రాజకీయాల నుంచి విరమించుకున్న జేపీ.. తన జీవితాన్ని ఆచార్య వినోబా భావే సర్వోదయ ఉద్యమానికి, దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశారు. తన భూమిని పేద ప్రజలకు ఇచ్చి హజారిబాగ్‌లో నెలకొల్పిన ఆశ్రమంలో ఉండేవారు. 1960 లో తిరిగి రాజకీయాల్లో వచ్చిన జేపీ.. 1974 లో బిహార్‌లో విద్యార్థి ఉద్యమానికి ఊపిరులూదారు. పదవుల కన్నా సేవ ముఖ్యం అని భావించిన జేపీ.. నెహ్రూ అనంతరం ప్రధానమంత్రి పదవి వచ్చినా తృణప్రాయంగా వదులుకున్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు పోరాడిన లోక్నానాయక్ జయప్రకాశ్ నారాయణ్‌కు మరణానంతరం 1999లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. జేపీ ప్రజాసేవలకు గుర్తింపుగా 1965లో మెగసెసే అవార్డు ప్రకటించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2008: కశ్మీర్‌లోని నౌగావ్ స్టేషన్ నుంచి మొదటి రైలును ప్రారంభించిన ప్రధాని మన్మోహన్ సింగ్
2007: సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికైన బ్రిటిష్ నవలా రచయిత డోరిస్ లాసింగ్
2005: క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన మూడవ అంతరిక్ష పర్యాటకుడు గ్రెగొరీ ఒల్సన్
2001: భారత సంతతికి చెందిన రచయిత విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపిక
2000: హన్సీ క్రోనేపై జీవితకాల నిషేధం విధించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్
2000: స్పేస్ షటిల్ ప్రోగ్రాం 100 వ మిషన్‌ను ప్రయోగించిన నాసా
1984: అంతరిక్షంలో నడిచి రికార్డు సృష్టించిన మొదటి మహిళా వ్యోమగామి కేథరీన్ డీ సుల్లివన్
1942: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ జననం
1932: న్యూయార్క్‌లో రాజకీయ ప్రచారం కోసం తొలి ప్రసారాలు ప్రారంభం
1881: కెమెరా రోల్ ఫిల్మ్‌కు పేటెంట్ పొందిన అమెరికన్ ఆవిష్కర్త డేవిడ్ హెండర్సన్ హౌస్టన్
ఇవి కూడా చదవండి..
ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్ది కీలకపాత్ర : ప్రధాని మోదీ
నార్వేజియన్ సోలార్ ప్యానల్ కంపెనీతో 6 వేల కోట్ల రిలయన్స్ ఒప్పందం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన టయోటా మిరై
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

