Space Association : ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్ది కీలకపాత్ర : ప్రధాని మోదీ
Space Association : ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షం కీలక పాత్ర పోషిస్తుందని, భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా ...

(Space Association) న్యూఢిల్లీ : ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షం కీలక పాత్ర పోషిస్తుందని, భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మార్చాల్సి ఉన్నదని తెలిపారు. ఎండ్ టు ఎండ్ టెక్నాలజీని కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి అని ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన లేదా అంతరిక్ష సాంకేతికతలను నిరంతరం అన్వేషించాలని అన్నారు.
భారత అంతరిక్ష సంఘం (ఐఎస్‌పీఏ) ను సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ పలువురు శాస్త్రవేత్తలు, ఐఎస్‌పీఏ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఎస్‌పీఏ వ్యవస్థాపక సభ్యులలో లార్సెన్ అండ్ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్‌మైఇండియా, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ ఉన్నాయి. ఇతర సభ్య సంస్థల్లో గోద్రేజ్, అగిస్టా- బీఎస్టీ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఈఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా ఉన్నాయి.
ఎయిర్ ఇండియాపై తీసుకున్న నిర్ణయం మా నిబద్ధత, తీవ్రతను తెలియజేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెల్లడించారు. పేదల ఇళ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో శాటిలైట్ ట్రాకింగ్ లేదా నావిగేషన్ టెక్నాలజీ అయినా.. పాలనను పారదర్శకంగా చేయడానికి సహాయపడుతున్నాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రశ్రేణి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ముందంజలో ఉంటే, పేదవారికి కూడా డాటాను అందుబాటులో ఉండేలా చేశామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నార్వేజియన్ సోలార్ ప్యానల్ కంపెనీతో 6 వేల కోట్ల రిలయన్స్ ఒప్పందం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన టయోటా మిరై
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

