RJD : ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లక్ష్యంగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. తేజస్వి కులం, దోపిడీ, లిక్కర్ మాఫియా, నేరాల గురించి మాట్లాడితే వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆయన అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. వారు గత 15 ఏండ్లుగా అధికారంలో ఉన్నారని, అయినా ఆయనకు జీడీపీ, జీడీపీ వృద్ధి గురించి ఏమీ తెలియదని అన్నారు.
అలాంటి తేజస్వి బిహార్ అభివృద్ధిపై మాట్లాడుతున్నారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఇక బిహార్లో నేరాల గురించి తేజస్వి యాదవ్ మాట్లాడుతున్నారని ఆరు నెలల కిందట తేజస్వి రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు బిహార్ ఆయనకు స్విట్జర్లాండ్లా కనిపించిందని, కానీ ఇప్పుడు అదే బిహార్ వరద కాల్వలా కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ ఇప్పుడు మహాకూటమిలో చేరితే బిహార్ మళ్లీ ఆయనకు గొప్పగా కనిపించడం మొదలవుతుందని వ్యాఖ్యానించారు.
కాగా, జనగణనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల పట్ల ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా అభ్యంతరం వ్యక్తం చేశారు. 2021 నుంచి ఎలాంటి జన గణన నిర్వహించలేదు.. జనగణన చేపట్టకపోవడం దేశంలో ఇదే తొలిసారి దీన్ని ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్ద దేశంలో సంక్లిష్ట సమయాల్లోనూ జనగణనను ఆపలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :