Engineer Rashid | ఉగ్రనిధుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అవామీ ఇత్తేహాద్ పార్టీ (Awami Ittehad Party) అధ్యక్షుడు, ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ (Sheikh Abdul Rashid) తాజాగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు (Seeks Interim Bail) చేయాలని పిటిషన్ వేశారు. ఈ మేరకు పిటిషన్ విచారణ సందర్భంగా ఇవాళ తీహార్ జైలు నుంచి వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ చేతులు జోడించి అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనపై నవంబర్ 27లోగా ప్రతిస్పందన దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను కోర్టు ఆదేశించింది.
ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించినట్లు ఆరోపణలు రావడంతో 2017లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (National Investigation Agency) ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. అనంతరం ఈ కేసులో విచారణను ఎదుర్కొంటూ ఆయన తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై ఏకంగా రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన పార్టీ తరఫున 34 మంది అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల్లో తన అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం మూడు నెలలపాటు మధ్యంతర బెయిల్ కావాలని కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. దాంతో కోర్టు 2024 అక్టోబర్ 2 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం తన తండ్రి అనారోగ్యం రీత్యా ముందుగా అక్టోబర్ 12 వరకు, ఆ తర్వాత అక్టోబర్ 28 వరకు బెయిల్ గడువు పొడిగించారు. ఇక కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన గత నెల 28న తీహార్ జైల్లో లొంగిపోయారు. ఇప్పుడు మరోసారి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
Also Read..
Nita Ambani | ఐపీఎల్ వేలంలో నీతా ఫ్యాషన్ సెన్స్.. ఆమె ధరించిన ప్యాంట్‌సూట్ ధర ఎంతో తెలుసా..?
UP groom | వరుడి మెడలోని మాలను లాక్కెళ్లిన ట్రక్ డ్రైవర్.. పెళ్లి కొడుకు ఏం చేశాడో చూడండి.. VIDEO
Drugs | అండమాన్ తీరంలో ఐదు టన్నుల డ్రగ్స్ స్వాధీనం.. కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇదే అత్యధికం