న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్, శుభాన్షు శుక్లా పాల్గొన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) మిషన్ యాత్ర, చంద్రయాన్, ఆదిత్య ఎల్1తో సహా భారతీయ అంతరిక్ష యాత్రలు వంటి అంశాలు త్వరలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) సిలబస్లో భాగం కానున్నట్లు కేంద్రం వెల్లడించింది. రెండు మాడ్యూల్స్ ప్రస్తుతం రూపకల్పన దశలో ఉన్నాయి.
మొదటి మాడ్యూల్ 3వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం కాగా రెండో మాడ్యూల్ 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం. ఒక్కో మాడ్యూల్ సుమారు 8 నుంచి 10 పేజీలు ఉంటుంది. ఇందులో భారతదేశ సైనిక ప్రస్థానంలో ప్రధాన మైలురాళ్ల గురించి ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ఉంటుంది.