Gaganyaan | భారత్ 2027 తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ నారాయణన్ పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్ కింద 7,700 గ్రౌండ్ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 2,300 పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. అంతరిక్షంలో మానవ మిషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్ కింద మూడు మానవరహిత మిషన్లు ఉంటాయని.. ఈ మిషన్లలో మొదటిది ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రతిపాదించినట్లు చెప్పారు. మరో రెండు మానవరహిత మిషన్లు పూర్తవుతాయని.. ఈ విమానాలన్నీ భారతదేశ మానవ అంతరిక్ష మిషన్‌ను విజయవంతం చేయడంలో కీలకమైన దశలన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టు కింద రెండు మానవరహిత మిషన్లకు ఇస్రో ఆమోదం లభించింది.
ఆట్రోనాట్స్ను అంతరిక్షంలోకి పంపిన దేశాల జాబితాలో చేరనున్నది. ఆయా మిషన్లతో భారతదేశ శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలు ప్రపంచానికి చాటిచెబుతాయన్నారు. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడం, 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రునిపైకి పంపే లక్ష్యానికి ప్రధాని నరేంద్ర ఇస్రోకు ఇచ్చారన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో ఇస్రో సహకారం.. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో 400 మందికి పైగా శాస్త్రవేత్తలు 24 గంటలూ పనిచేశారని ఇస్రో చీఫ్ చెప్పారు. మిషన్‌లో భూమి పరిశీలన, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.