Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ముంబైలోని గిర్గావ్ (Girgaum) ప్రాంతంలో గల ఇస్కాన్ ఆలయానికి (ISKCON Temple) ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఆలయ అధికారిక ఈమెయిల్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన ఇస్కాన్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గిర్గావ్ ప్రాంతంలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపులు రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
Also Read..
Anjali Tendulkar | ఫ్లాట్ కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్ భార్య.. ధర తెలిస్తే షాకే..!
Chennai rains | చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. ఐఎండీ హెచ్చరికలు
Rekha Gupta | దాడి తర్వాత.. తొలిసారి పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. VIDEO