High Court | లక్నో: వివాహ వేడుక లేదా విహారం నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరే హక్కు బెయిల్ మీద ఉన్న నిందితుడికి ఉండదని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్ బరేలీలోని కన్సల్టెంట్గా పనిచేస్తున్న ఆదిత్యమూర్తి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. నిందితుడు విదేశీ ప్రయాణానికి బంధువుల వివాహం లేదా విదేశాల్లో విహారం ముఖ్యమైన కారణాలుగా పరిగణించలేమని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.
బంధువుల పెండ్లికి వెళ్లేందుకు అమెరికా, ఫ్రాన్స్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఆదిత్యమూర్తి కోర్టును కోరగా, అందుకు న్యాయస్థానం తిరస్కరించింది. అత్యవసర అధికారిక పనులు, వైద్య చికిత్స నిమిత్తం మాత్రమే విదేశీ ప్రయాణానికి అర్హుడవుతాడని స్పష్టం చేసింది.