Iron Pillar | రద్దీ రోడ్డుపై కూలిన ఐరన్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం
Iron Pillar | కర్ణాటక (Karnataka) రాష్ట్రం హుబ్బలి (Hubballi)లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్ రాడ్ (Iron Pillar Collapses) ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది.
Iron Pillar | కర్ణాటక (Karnataka) రాష్ట్రం హుబ్బలి (Hubballi)లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్ రాడ్ (Iron Pillar Collapses) ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి.
రైల్వే బ్రిడ్జి (railway bridge) ముందు ఈ పిల్లర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది నుంచి వెళ్లే వాహనాల ఎత్తును హెచ్చరిస్తూ దీన్ని ఏర్పాటు చేశారు. ఆ ఐరన్ పిల్లర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. పిల్లర్ కూలేందుకు కొద్ది క్షణాల ముందు ఓ వాటర్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్లింది. కొన్ని బైక్ లు, బస్సు అటువైపే వెళుతున్నాయి. ఇంతలో పిల్లర్ కూలిపోతుండటాన్ని గమనించిన వాహనదారులు ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్క క్షణం అటూ ఇటూగా అయినా వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.
ఇటీవలే పలు వాహనాలు ఈ ఐరన్ పిల్లర్ ను ఢీ కొట్టడంతో అది బలహీనపడిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు నిత్యం రద్దీగా ఉండే ఆ రోడ్డు వాహనాల రాకపోకల సందర్భంగా వైబ్రేషన్ కు పిల్లర్ మరింత బలహీనంగా మారినట్లు చెప్పారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read..
Heavy rain warning | దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
cheetahs | కూనో నేషనల్ పార్క్లో చీతాల మధ్య ఘర్షణ.. అగ్నికి తీవ్ర గాయాలు
Schooling | ప్రారంభమైన స్కూళ్లు.. పిల్లలకు సంపూర్ణ పోషకాలు అందాలంటే లంచ్ బాక్సులో ఏం పెట్టాలి?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

