PM Modi | ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం.. ఆహ్వానించిన ఇరాన్ ప్రెసిడెంట్
PM Modi | ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ (Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayathollah Ali Khamenei) అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని మోదీ (PM Modi) ని ఇరాన్ (Iran) ఆహ్వానించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్వయంగా లేఖ రాశారు.
PM Modi : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ (Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayathollah Ali Khamenei) అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని మోదీ (PM Modi) ని ఇరాన్ (Iran) ఆహ్వానించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్వయంగా లేఖ రాశారు. మరి దీనిపై కేంద్రం (Union Govt) ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారత్ ఇప్పటివరకు ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల విషయంలో శాంతి, చర్చల ద్వారానే పరిష్కారం కావాలని తన వైఖరిని చెబుతూ వస్తోంది.
ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు జూలై 4న ప్రారంభం కానున్నాయి. పలు దశల్లో జరిగే నివాళి కార్యక్రమాల అనంతరం జూలై 9న ఆయన స్వస్థలమైన మష్హాద్‌లో ఖననం చేయనున్నారు. టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది.
దాదాపు 36 ఏళ్ల పాటు ఆయన ఇరాన్‌కు సుప్రీం లీడర్‌గా సేవలందించారు. అంత్యక్రియలకు కోట్ల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తరఫున కూడా ప్రతినిధి బృందం హాజరుకానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ అధ్యక్షుడు తనను కూడా ఆహ్వానించారని షెహ్బాజ్ షరీఫ్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

