న్యూఢిల్లీ: పార్లమెంటు, శాసనసభల సభ్యులపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేయాలని కోర్టులను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వీరిపై దాదాపు 5,000 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తుపై వారి ప్రభావం చాలా ఉంటున్నదని, విచారణ జరగనివ్వడం లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, హైకోర్టులు పర్యవేక్షిస్తున్నప్పటికీ, వీరిపై కేసులు పెండింగ్లోనే ఉంటుండటం మన దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు కళంకమని పేర్కొంది.