Venkaiah Naidu | మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి కీలక నేతలతో భేటీ అయ్యారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్‌ను కలిశారు. దేశ్‌బంధు గుప్త రోడ్లో కొత్తగా నిర్మించిన రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయం ‘కేశవ్ కుంజ్’ను ఆదివారం సందర్శించిన ఆయన.. సంస్థ ప్రాంగణంలో ఉన్న ‘శ్రీ కేశవ్ బలీరాం హెడ్గేవార్’ విగ్రహానికి నివాళులర్పించారు. వెంకయ్య వెంట ఆయన మిత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, తుమ్మల రంగారావు ఉన్నారు. శనివారం ప్రధాని మోదీతో సమావేశమైన వెంకయ్య నాయుడు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ఒక వైపు ఉప రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా కీలక అంశాలపై వెంకయ్య నాయుడుతో కేంద్ర ప్రభుత్వ, ఆర్ఎస్ఎస్ ముఖ్యులు చర్చించి.. సలహాలు సూచనలు కోరినట్లు సమాచారం.