ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలపై దాదాగిరి పెరుగుతున్నదని అన్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని ఆరోపించారు. పూణే మెట్రోపాలిటన్ రీజియన్ గ్రోత్ హబ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. పుణే అభివృద్ధికి ‘దాదాగిరి’ అతిపెద్ద అడ్డంకి అని అన్నారు. పరిశ్రమలపై ఒత్తిడి తీసుకురావడానికి లేదా కాంట్రాక్టులు ఇవ్వడానికి కొన్ని శక్తులు దాదాగిరి, బెదిరింపు వంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘నేడు, కొంతమంది తాము సిఫార్సు చేసిన అభ్యర్థులను నియమించుకోవాలని, తమ నుంచి ముడి పదార్థాలను కొనుగోలు చేయాలని, తమ వారికి మాత్రమే కాంట్రాక్టులను కేటాయించాలని పరిశ్రమలపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ రకమైన జోక్యం పూణే పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారింది’ అని అన్నారు.
కాగా, ఈ బెదిరింపు మనస్తత్వాన్ని నిర్మూలించకపోతే, మహారాష్ట్రలో రెండవ అతిపెద్ద నగరం, దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలలో ఒకటైన పూణే దాని నిజమైన అభివృద్ధి సామర్థ్యాన్ని సాధించలేదని ఫడ్నవీస్ తెలిపారు. పెట్టుబడిదారుల స్వేచ్ఛ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ స్థాయిలో ఇబ్బంది లేని వాతావరణాన్ని నిర్ధారించడం సరిపోదని అన్నారు. విస్తృత సామాజిక, రాజకీయ, పర్యావరణ వ్యవస్థలన్నీ వ్యాపారాలకు అనుకూలంగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే స్థానికంగా రాజకీయ బలం ఉన్న ఏక్నాథ్ షిండే శివసేన వర్గం లేదా ఎంఎన్ఎస్ దాడుల గురించి ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారా అన్నది అర్థం కాలేదు.
Also Read:
IIT Bombay student suicide | హాస్టల్ టెర్రస్ పైనుంచి దూకి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య
CRPF jawan shot dead | కన్వర్ యాత్రలో ఘర్షణ.. సీఆర్పీఎఫ్ జవాన్‌పై కాల్పులు జరిపి హత్య
Watch: సడన్ బ్రేక్ వేసిన బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిన తల్లి చేతిలోని బిడ్డ