Tulip Garden | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir)లో రంగురంగుల విరులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. అక్కడ ఆసియాలోనే అతి పెద్దదైన ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్ Indira Gandhi Memorial Tulip Garden)లో విరబూసిన తులిప్ పూలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీనగర్ (Srinagar) లోని తులిప్ గార్డెన్ (Tulip Garden) ను పుష్పవర్ధన విభాగం అధికారులు తెరిచారు. ఏటా పుష్పాలు వికసించే సీజన్లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గార్డెన్‌ను తెరుస్తుంటారు. తులిప్ పూలతోపాటు చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్ గార్డెన్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి.
#WATCH | J&K: Indira Gandhi Memorial Tulip Garden in Srinagar opened for the public today, 26th March. 17 lakh tulips are on display here. pic.twitter.com/pizCFdhmTr
— ANI (@ANI) March 26, 2025
శ్రీనగర్‌లోని తులిప్‌తోట.. ఆసియాలోనే అతి పెద్దది. ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది ఈ తులిప్ తోట. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు శ్రీనగర్‌కు క్యూ కడుతుంటారు. ఈ సీజన్లో అక్కడ పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. దేశ, విదేశాల నుంచి భారీగా తరలివస్తుంటారు. ఈసారి కూడా తులిప్ పూలు బాగా వికసించాయి. ఈ ఏడాది 17 లక్షల పువ్వులు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి.
In Pictures || Srinagar’s iconic and Aisa’s Famous Tulip Garden will open its Gates on March 26, featuring a stunning display of 1.7 million tulips in full bloom pic.twitter.com/PF3S7rIPGk
— 𝐌𝐨𝐡𝐬𝐢𝐧 𝐀𝐥𝐭𝐚𝐟 (محسن ألطاف حسنين) (@MohsinAltaf786H) March 25, 2025
ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే (Asias Largest) అతిపెద్దది. ఈ గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్లు ఉంది. ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తుంటే ఈ గార్డెన్‌ను తెరుస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది తులిప్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు.
Also Read..
Yogi Adityanath | యూపీలో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారు : యోగి ఆదిత్యనాథ్