IndiGo Refunds | ఇండిగో విమానాల టికెట్ల రీఫండ్‌కు (IndiGo Refunds) సంబంధించి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక వివరాలు వెల్లడించింది. సంక్షోభం కారణంగా రద్దైన, ఆలస్యమైన విమానాల టికెట్ల రిఫండ్‌కు సంబంధించి ఇప్పటి వరకూ రూ.827 కోట్లను ఇండిగో చెల్లించినట్లు ప్రకటించింది. రెండు వారాల్లోనే ఈ మొత్తం రిఫండ్ చేసినట్లు తెలిపింది.
నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 మధ్య రెండు వారాల్లో మొత్తం 9,55,591 టికెట్ల రద్దకు సంబంధించి రూ.827 కోట్లను తిరిగి చెల్లించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 మధ్య ఆరు లక్షల టిక్కెట్ల రద్దుకు సంబంధించి రూ.569 కోట్లను తిరిగి రీఫండ్ చేసినట్లు తెలిపాయి. అంతేకాదు.. 9,000 బ్యాగుల్లో ప్రభావిత ప్రయాణికులకు ఇప్పటి వరకూ 4,500 సామగ్రిని ఇండిగో తిరిగి ఇచ్చినట్లు పేర్కొన్నాయి. రాబోయే 36 గంటల్లో బ్యాలెన్స్ బ్యాగులను డెలిరవీ చేయడమే లక్ష్యంగా సదరు వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Starlink | భారత్‌లో స్టార్లింగ్ సేవలు.. సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించిన మస్క్ సంస్థ
IndiGo | ఇండిగో అంతర్గత సమస్యలతోనే ఈ సంక్షోభం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Supreme Court | ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ