Starlink | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్టార్‌లింక్ (Starlink) సంస్థ శాటిలైట్ వ్యవస్థ (Starlink satellite services) ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత్‌లో రంగం సిద్ధమైంది. ఇప్పటికే మన దేశానికి చెందిన జియో, ఎయిర్‌టెల్‌తో స్టార్‌లింక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. త్వరలో ఇండియాలో కమర్షియల్ సేవలు అందించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలను సంస్థ తాజాగా వెల్లడించింది.
స్టార్లింగ్ ఇండియా వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సేవలు పొందాలంటే రెసిడెన్షియల్ కస్టమర్లు నెలకు రూ.8,600 చెల్లించాల్సి ఉంటుంది. హార్డ్‌వేర్ కిట్‌కు అదనంగా రూ.34వేలు చెల్లించాలి. ఈ ప్యాకేజీలో సాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, మౌంటింగ్ స్టాండ్, కేబుల్స్, పవర్ అడాప్టర్‌తో కూడిన ప్లగ్-అండ్-ప్లే కిట్ వినియోగదారులకు ఇవ్వనున్నారు. ఈ ప్లాన్‌లో అపరిమిత డేటాతో పాటు 30 రోజుల పాటు ఫ్రీ ట్రయల్‌ను ఆస్వాదించొచ్చుది. 99.9 శాతం కంటే ఎక్కువ నెట్వర్క్ అప్‌టైమ్‌తో ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా నిర్విరామంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు దీన్ని కొనుగోలు చేసిన వెంటనే ప్లగ్ ఇన్ చేసి సేవలను ప్రారంభించొచ్చు.
Also Read..
IndiGo | ఇండిగో అంతర్గత సమస్యలతోనే ఈ సంక్షోభం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Supreme Court | ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ
Air India | కేంద్రం మార్గదర్శకాలు.. టికెట్ ధరలపై పరిమితి విధించిన ఎయిర్ ఇండియా