IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో సాంకేతిక సమస్య తలెత్తింది (massive system slowdown). దీంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. చెక్-ఇన్ ప్రక్రియలు (slower check-ins) నెమ్మదిగా సాగడంతో పాటు, టికెట్ బుకింగ్‌లలో సైతం సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో చెక్-ఇన్ కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది.
ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపంపై ఇండిగో స్పందించింది. తమ నెట్‌వర్క్‌లు అన్నింటిలోనూ తాత్కాలికంగా వ్యవస్థలు నెమ్మదించాయని తెలిపింది. దీని ప్రభావం వెబ్సైట్, బుకింగ్ సిస్టమ్‌పై పడిందని పేర్కొంది. చెక్-ఇన్లు ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలిపింది. దీంతో రద్దీ పెరిగే అవకాశం ఉందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను అందించేందుకు తమ ఎయిర్పోర్ట్ బృందం కృషి చేస్తోందని వెల్లడించింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇండిగో స్పష్టం చేసింది. ఈ మేరకు కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. మరోవైపు ఎయిర్‌లైన్స్‌లో నెలకొన్న సమస్య నేపథ్యంలో తమకు కలిగిన అసౌకర్యాన్ని పలువురు కస్టమర్ల సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు.
#6ETravelAdvisory : We are currently experiencing a temporary system slowdown across our network, affecting our website and booking system. As a result, customers may face increased wait times, including slower check-ins and longer queues at the airport. (1/3)
— IndiGo (@IndiGo6E) October 5, 2024
We regret the inconvenience caused and appreciate your understanding and patience during this time. (3/3)
— IndiGo (@IndiGo6E) October 5, 2024
#Indigo airlines computer systems have crashed and they have a massive backup at airports. I am in Kolkata taking off. Is anyplace else is India having a similar issue pic.twitter.com/OpEDoOnSGN
— Rohit Gandhi (@rohitgandhi_) October 5, 2024
Technical Glitch at @IndiGo6E
Airport looks like Railway Station #indigo #monopoly #delays pic.twitter.com/fFfMf64G5o— Professor (@Masterji_UPWale) October 5, 2024
Booked a last-minute flight coz I desperately needed to get home ASAP—only for the servers to crash and the flight to get delayed. So now, instead of zooming through the skies, I’m stuck in an airport purgatory where the only thing flying is my patience… out the window.#indigo pic.twitter.com/18EYkfyahC
— navneeth (@navneet77009273) October 5, 2024
From morning am trying to book air ticket via indigo app and this message is where I end over and again. Extremely frustrating.@IndiGo6E @indscribe pic.twitter.com/uuRtXK7zhs
— SAIF (@Saiflens) October 5, 2024
Also Read..
Durga Puja | మటన్ బిర్యానీ టు చికెన్ కర్రీ.. బెంగాల్ జైళ్లలో దుర్గా పూజ సందర్భంగా ఖైదీల మెనూ
Bigg Boss 18 | ఫారెస్ట్ థీమ్‌తో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ హౌస్.. వీడియో వైరల్
Bomb Threats | వడోదర, రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు