న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. సామాన్య పౌరుల రక్షణ కోసం సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. చర్చలు, దౌత్యం ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. కాగా, ఇరాన్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, తమ కార్యాలయంతో కాంటాక్ట్‌లో ఉండాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది.
ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని భారతీయులకు సూచించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని భారతీయులకూ టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఇవే సూచనలు చేసింది. కాగా, ఇరాన్‌లోని తమ దేశస్థులు వెంటనే తిరిగి రావాలని ఫ్రాన్స్ పిలుపునిచ్చింది. ఇరాన్ గగనతలం నుంచి రాకపోకలు వద్దని ఐరోపా ఎయిర్లైన్లకు యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సెఫ్టీ ఏజెన్సీ సూచించింది.