న్యాయబద్దమైన ఇంధన లావాదేవీలపై రాజకీయం వద్దు..
న్యూఢిల్లీ: రష్యా వద్ద డిస్కౌంట్లో ఇండియా ఆయిల్ కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే న్యాయబద్ధంగా జరుగుతున్న ఇంధన లావాదేవీలను రాజకీయం చేయరాదు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల ప్రస్తుతం గ్లోబల్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అయితే రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశం తమ వద్ద ఉన్న ఇంధన నిల్వలను క్లియర్ చేసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇండియాకు తక్కువ ధరలో ఆయిల్‌ను అమ్మే ప్రయత్నం చేస్తోంది.
డిస్కౌంట్లో చమురును కొనేందుకు ఇండియా కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ ఎక్కువగా ఇంధన దిగుమతులపై ఆధారపడుతుందని, దాదాపు 85 శాతం ముడి చమురును మనం దిగుమతి చేసుకుంటామని, ఎక్కువ శాతం వెస్ట్ ఆసియా దేశాల నుంచి ఆయిల్ వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇరాక్ నుంచి 23, సౌదీ నుంచి 18, యూఏఈ నుంచి 11, అమెరికా నుంచి 7.3 శాతం ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇరాన్, వెనిజులా నుంచి దిగుమతు ఆపేశామని, ఉక్రెయిన్ వార్తో ఇంధన ధరలు సవాల్‌గా మారినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
రష్యా నుంచి కేవలం ఒక శాతం మాత్రమే మనం ఆయిల్ తెస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తిదారులు ఇచ్చే ఆఫర్లకు వెల్కమ్ చెబుతున్నామని ప్రభుత్వం వెల్లడించింది. రష్యా నుంచి మూడు బిలియన్ల బ్యారెళ్ల చమురును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

