బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 09:35:13

భార‌త్‌లో 50 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

భార‌త్‌లో 50 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: ఇండియాలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు దూసుకువెళ్తున్నాయి.  దేశంలో వైర‌స్ కేసుల సంఖ్య 50 ల‌క్ష‌ల మైలురాయిని దాటేసింది.  కోవిడ్‌19 కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్న‌ది.  గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్తగా 90,123 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  గ‌త 24 గంట‌ల్లోనే దేశంలో 1290 మంది కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 50,20,360గా ఉన్న‌ది.  దీంట్లో యాక్టివ్ కేసులు 9,95,933 ఉన్నాయి. 39,42,361 మంది వైర‌స్ సంక్ర‌మ‌ణ నుంచి కోలుకున్నారు.  దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 82,066 మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.  వైర‌స్ శ్యాంపిళ్ల ప‌రీక్ష‌కు సంబంధించి ఐసీఎంఆర్ డేటాను రిలీజ్ చేసింది.  సెప్టెంబ‌ర్ 15వ తేదీన 5,94,29,115 శ్యాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు ఐసీఎంఆర్ చెప్పింది. logo