ఆదివారం 24 జనవరి 2021
National - Dec 25, 2020 , 18:25:54

39 మంది భారతీయ నావికుల్ని అడ్డుకున్న చైనా

39 మంది భారతీయ నావికుల్ని అడ్డుకున్న చైనా

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన సుమారు 39 మంది నావికుల్ని చైనా అడ్డుకున్నది. అయితే సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు రవాణా చేసే భారత్‌కు చెందిన రెండు కార్గో నౌకలు ఎంవీ జగ్ ఆనంద్, ఎంవీ అనస్తాసియాను చైనాలోని రెండు నౌకా పోర్టుల్లో గత కొన్ని నెలలుగా నిలిపివేశారు. రెండు నౌకల్లోని 39 మంది భారతీయ నావికులను కిందకు దిగనీయడం లేదు. దీంతో వారు శారీరక, మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. కాగా భారతీయ రవాణా నౌకలను చైనా పోర్టుల నుంచి ఆ దేశ అధికారులు కదలనివ్వకపోకడాన్ని భారత విదేశాంగ శాఖ ప్రశ్నించింది. 

మరోవైపు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ శుక్రవారం దీనిపై వివరణ ఇచ్చారు. క్వారంటైన్‌ నిబంధనల వల్లనే భారతీయ రవాణా నౌకలను నిలిపివేసినట్లు తెలిపారు. నావికుల గురించి భారత్‌ చేస్తున్న విజ్ఞప్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  సరిహద్దులో భారత్‌, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు లేదా వాణిజ్య సంబంధాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo