శనివారం 04 జూలై 2020
National - Jun 27, 2020 , 14:41:47

క‌రోనా చికిత్స‌.. డెక్సామీథాసోన్‌కు ఓకే చెప్పిన ఇండియా

క‌రోనా చికిత్స‌.. డెక్సామీథాసోన్‌కు ఓకే చెప్పిన ఇండియా

హైద‌రాబాద్: కోవిడ్‌19 చికిత్స‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వం కొత్త ప్రోటోకాల్‌ను జారీ చేసింది.  క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు మ‌ధ్య‌స్థ‌, తీవ్ర స్థాయిలో ఉన్న పేషెంట్లు.. గ్లూకోకార్టికోస్టిరాయిడ్ డెక్సామీథాసోన్‌ను వాడ‌వ‌చ్చు అని కేంద్ర ఆరోగ్య‌శాఖ ఇవాళ స్ప‌ష్టం చేసింది.మిథైల్‌ప్రిడినిసోలోన్ స్థానంలో డెక్సామీథాసోన్ వాడ‌వ‌చ్చు అని ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఆక్సిజన్ అవ‌స‌రం ఉన్న రోగుల్లో తీవ్ర నొప్పులు, వాపులు ఉంటాయ‌ని, అలాంటి వారికి ఈ ట్యాబెట్లు ఉప‌క‌రిస్తాయ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

ఇటీవ‌లే డెక్సామిథాసోన్ స్టెరాయిడ్‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ప‌చ్చ‌జెండా ఊపింది. డెక్సామిథాసోన్‌ ఉత్పత్తిని అత్య‌ధిక స్థాయిలో పెంచాలని డ‌బ్ల్యూహెచ్‌వో సూచించింది. కరోనా వైరస్ తీవ్రంగా ప్ర‌భావం చూపిన‌ రోగులకు ఈ ఔషధాన్ని వాడటంవల్ల మరణాల సంఖ్య తగ్గుతుందని ఆరోగ్య సంస్థ అభిప్రాయ‌ప‌డింది. బ్రిటిష్‌ ట్రయల్స్‌లో డెక్సామిథాసోన్‌ మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితమైంద‌ని, అందుకే ఆ ఔష‌ధానికి డిమాండ్ బాగా  పెరిగింద‌ని, అందువ‌ల్ల డెక్సామిథాసోన్‌ ఉత్పత్తిని వేగవంతం చేయాల‌ని ఇటీవ‌ల డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ తెలిపారు.logo