బుధవారం 28 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 09:10:46

సరిహద్దుల్లో పాక్‌ కాల్పులు.. భారత సైనికుడి మృతి

సరిహద్దుల్లో పాక్‌ కాల్పులు.. భారత సైనికుడి మృతి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మరోమారు కాల్పులకు తెగబడింది. బుదవారం రాత్రి పొద్దుపోయిన తర్వాతర పాక్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్‌ కన్నుమూశాడు. నిన్న రాత్రి 10.30 గంటలకు పూంచ్‌ జిల్లాలోని కృష్ణఘటి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైనికులు చిన్న ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులు జరిపారు. ఇందులో ఇండియన్‌ ఆర్మీకి చెందిన లాన్స్‌ నాయక్‌ కర్నైల్‌ సింగ్‌ అమరుడయ్యాడని ఆర్మీ పీఆర్‌ఓ వెల్లడించారు.  

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపాయి. దీంతో జమ్ము లోయలో ఉగ్ర చర్యలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోకి ఉద్రవాదుల అక్రమ చొరబాటుకు అనుకూలంగా సరిహద్దుల్లో పాకిస్థాన్‌ తరచూ కాల్పులకు పాల్పడుతున్నది. 


logo