షాజహాన్‌పూర్: పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన వేళ భారత వాయుసేన కీలక పరీక్షలు నిర్వహిస్తున్నది. ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను పరీక్షిస్తున్నది. యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఉన్న గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై దాదాపు 3.5 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్‌పై ఈ డ్రిల్‌ను శుక్రవారం విజయవంతంగా చేపట్టింది. రాఫెల్, ఎస్‌యూ-30 ఎంకేఐ, మిరాజ్-2000, మిగ్-29, జాగ్వార్, సీ-130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్-32 వంటి యుద్ధ విమానాలు ఈ డ్రిల్‌లో పాల్గొంటున్నాయి.
పగలు-రాత్రి యుద్ధవిమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా ఈ ఎక్స్‌ప్రెస్‌వే స్ట్రెచ్‌ను నిర్మించారు. గతంలో లక్నో-ఆగ్రా, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ డ్రిల్స్ నిర్వహించారు. అయితే అవి పగటి పూట ఆపరేషన్స్‌కు మాత్రమే పరిమితం. ఇంకా కొంత నిర్మాణం జరగాల్సిన గంగా ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే ఇది దేశంలోనే నాలుగో అత్యవవసర ఎయిర్‌స్ట్రిప్‌గా సేవలందించేందుకు సిద్ధమవుతుంది.