న్యూఢిల్లీ: భారత్-అఫ్ఘానిస్థాన్ దౌత్య సంబంధాల్లో ముందడుగు పడింది. కాబూల్‌లోని భారత తరఫున పనిచేస్తున్న ‘టెక్నికల్ మిషన్’కు ఎంబసీ హోదా కల్పిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ప్రకటించారు.
‘కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం అఫ్ఘాన్ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఆ దేశ సమగ్ర అభివృద్ధికి భారత్ సహకారాన్ని మరింత పెంచుతుంది’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ముత్తాకీ భారత పర్యటన అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.