Agni Prime Missile | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో ఘనత సాధించింది. బుధవారం అర్ధరాత్ర ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బాలాసోర్ (Balasore) ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో నిర్వహించిన ‘అగ్ని ప్రైమ్’ (Agni Prime Missile) క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) గురువారం ఉదయం ప్రకటించారు.
2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రయోగాన్ని రైలు ఆధారిత మొబైల్ లాంఛర్ వ్యవస్థ (rail based launcher) నుంచి విజయవంతంగా పరీక్షించినట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ విజయాన్ని భారత రక్షణ రంగంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అణు సామర్థ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణికి 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే సత్తా ఉంది.
#WATCH | Raksha Mantri Rajnath Singh tweets, “India has carried out the successful launch of Intermediate Range Agni-Prime Missile from a Rail-based Mobile launcher system. This next-generation missile is designed to cover a range of up to 2000 km and is equipped with various… pic.twitter.com/kfDOjVpAeW
— ANI (@ANI) September 25, 2025
Also Read..
Liquor Scam | మద్యం కుంభకోణం.. మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
Ladakh Statehood | మంటల్లో లద్దాఖ్.. రాష్ట్ర హోదా కోసం వెల్లువెత్తిన నిరసనలు