India Corona | భారత్లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Ministry Of India) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64,740 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,038 కొత్త కేసులు బయటపడ్డాయి.
దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,29,284కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,179 కేసులు యాక్టివ్గా (Active Cases) ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కొవిడ్ (Covid-19) నుంచి 4,41,77,204 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్, కేరళలో ఇద్దరు చొప్పున, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,901 కి చేరింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.05 శాతం యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Ministry Of India) అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.76 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 22.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
Also Read..
Bengal Violence: హూగ్లీలో మళ్లీ హింస.. నిలిచిపోయిన రైళ్లు
Mughal History | 12వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి మొఘల్ చరిత్ర తొలగింపు.