India Corona | 24 గంటల్లో 2,994 కొత్త కేసులు.. ఐదుగురు మృతి
India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి.
India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry Of India) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి.
మరోవైపు దేశంలో పాజిటివ్ కేసుల (Positive Cases) సంఖ్య 16వేల మార్క్ను దాటింది. ప్రస్తుతం 16,354 కేసులు యాక్టివ్గా (Active Cases) ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,71,551 మంది కోలుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కేరళ (Kerala)లో ముగ్గురు, గోవా (Goa), గుజరాత్ (Gujarat)లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. దీంతో కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,876కి చేరింది.
ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో (Positive Cases)0.04 శాతం యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.77 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 (220,66,09,015) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) వెల్లడించింది.
Also Read..
Hinduphobia: హిందువులపై దాడుల్ని ఖండిస్తూ అమెరికాలో తీర్మానం
Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఆ టైమ్లో ప్రయాణిస్తే 10 శాతం డిస్కౌంట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

