న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు కొత్తగా మరో 10,649 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,43,68,195కు చేరాయి. ఇందులో 4,37,44,301 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,452 మంది మరణించారు. మరో 96,442 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 36 మంది కరోనాకు బలవగా, 10,677 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.22 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 210.58 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.