Ind vs Pak : సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడటం ఇదే తొలిసారి. శనివారం సాయంత్రం జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని కుప్వారా (Kupwara) జిల్లాలో నౌగామ్ సెక్టార్ దగ్గర భారత్ – పాకిస్థాన్ బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
శనివారం సాయంత్రం ఎల్వోసీ వెంబడి పాకిస్థాన్ బలగాలు భారత స్థావరాలపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఆ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. దాదాపు ఒక గంటపాటు కొనసాగిన కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పాయి. అయితే ఆ ఘటనకు సంబంధించి భారత సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.