India-Pak | పొరుగుదేశం పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టి షాకిచ్చింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం విరుచుకుపడింది. ప్రతీకార దాడులకు ప్రయత్నించిన దాయాది దేశానికి కోలుకోలేని దెబ్బ కొట్టింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్‌లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రత్నించించింది. బుధవారం రాత్రి, ఇవాళ తెల్లవారుజామున భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాక్ ప్రయత్నించినట్లు రక్షణ శాఖ తెలిపింది. అయితే, ఆ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.
జమ్ము కశ్మీర్, పంజాబ్, గుజరాత్, శ్రీనగర్, పఠాన్‌కోట్, అమృత్సర్, లూథియానా, చండీగఢ్ సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ దాడులకు ప్రయత్నించినట్లు తెలిపింది. వీటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు పేర్కొంది. పాక్ మిస్సైళ్లను గగనతంలోనే పేల్చేసినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే లాహోర్ (Lahore)లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (Air Defence System) ధ్వంసమైనట్లు తెలిపింది. పాకిస్థాన్ వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. హార్పీ డ్రోన్స్ (Harpy drones)ను ఉపయోగించి పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను నిర్వీర్యం చేసినట్లు ప్రకటించింది. మరోసారి కవ్వింపులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది.
మరోవైపు ఎల్వోసీ వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. కుప్వారా, బారాముల్లా, యురి, పూంఛ్, మెందార్, రాజౌరి సెక్టార్లలో పాక్ కాల్పులకు పాల్పడుతోంది. మోర్టార్లు, భారీ శతఘ్నులతో దాడులకు తెగబడుతోంది. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో భారత్ ప్రతిదాడులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Also Read..
Bomb Threat | ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ.. జైపూర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపులు
100 Terrorists Killed | ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం : రాజ్‌నాథ్ సింగ్
Fact Check | ‘ఫేక్ యుద్ధాని’కి తెరలేపిన పాక్.. ‘ఫ్యాక్ట్ చెక్’తో చెక్ పెట్టిన భారత్