Bomb Threat | పాక్‌తో ఉద్రిక్తతల వేళ దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపుతున్నాయి. నిన్న ఇండిగో విమానానికి ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జైపూర్‌లోని క్రికెట్ స్టేడియానికి (Jaipur stadium) బాంబు బెదిరింపులు వచ్చాయి.
జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియానికి ఇవాళ ఉదయం 9:13 గంటల సమయంలో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ ఈ మెయిల్ పంపారు. స్టేడియంలో పేలుడు జరగవచ్చని హెచ్చరించారు. వీలైనంత వరకూ ప్రతి ఒక్కరినీ రక్షించుకోండి అంటూ దుండగులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి గుర్తుగా.. మేము మీ స్టేడియాన్ని బాంబులతో పేల్చేస్తాం. వీలైనంత వరకూ ప్రతి ఒక్కరినీ రక్షించుకోండి’ అంటూ పేర్కొన్నారు. బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మే 16న ఇక్కడ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
బుధవారం ఉదయం చండీగఢ్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో (IndiGo) విమానంలో బాంబు ఉన్నట్లు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఆ విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరించారు. అయితే, విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. భద్రతా బలగాలు వెంటనే విమానాన్ని ఖాళీ చేయించి.. తనిఖీలు నిర్వహించారు. అయితే, అందులో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభ్యం కాలేదు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాక్‌పై ప్రతీకార దాడుల వేళ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. అనంతపురం ఎంపీ సోదరి మృతి
Pak national | చొరబాటుకు యత్నం.. పాక్ జాతీయుడిని హతమార్చిన బీఎస్ఎఫ్
100 Terrorists Killed | ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం : రాజ్‌నాథ్ సింగ్