చెన్నై: దేశ భద్రత కోసం రానున్న మూడేళ్లలో 100-150 ఉపగ్రహాలను అందుబాటులోకి తేనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వీ నారాయణన్ చెప్పారు. వీటితో సరిహద్దు భద్రత, తీర ప్రాంత నిఘా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం మన దేశం దాదాపు 55 ఉపగ్రహాల సేవలను వినియోగించుకుంటున్నదన్నారు.
సుదూర తీర ప్రాంతం ఉన్న దేశానికి ఇవి సరిపోవని తెలిపారు. అందుకే అంతరిక్ష రంగంలో సంస్కరణలు తెచ్చి రాకెట్లు, ఉపగ్రహాల నిర్మాణ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తున్నట్లు చెప్పారు.