(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు.
అయితే, వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తూ ఇదంతా ఉత్త ముచ్చటగానే తెలుస్తున్నది. 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన పదకొండేండ్లలో దేశంలో 68 ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో 360 మంది వరకూ సైనికులు. పోలీసులు అమరులవ్వగా, 230 మంది పౌరులు మృతి చెందారు.
దాడి: కశ్మీర్ లోయ దాడులు
ఎప్పుడు: డిసెంబర్, 2014
ఎక్కడ: కశ్మీర్ లోయ, ఉరి, బారముల్లా జిల్లా
ఏమైంది: ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల దాడి న
నష్టం: అమరులైన 17 మంది సైనికులు
దాడి: గుర్దాస్పూర్ దాడులు
ఎప్పుడు: జూలై, 2025
ఎక్కడ: గుర్దాస్పూర్, పంజాబ్
ఏమైంది: పోలీసుస్టేషన్‌పై ఉగ్రదాడి
నష్టం: 8 మంది మృతి
దాడి: పఠాన్‌కోట్ దాడులు
ఎప్పుడు: జనవరి, 2016
ఎక్కడ: పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్
ఏమైంది: ఎయిర్‌బేస్ స్టేషన్‌పై దాడికి తెగబడ్డ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు
నష్టం: అమరులైన 8 మంది సైనికులు, ఒక పౌరుడి మరణం, 25 మందికి గాయాలు
దాడి: పాంపోర్ దాడులు
ఎప్పుడు: జూన్, 2016
ఎక్కడ: పాంపోర్, పుల్వామా జిల్లా
ఏమైంది: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి
నష్టం: అమరులైన 8 మంది జవాన్లు
దాడి: ఉరి ఎటాక్
ఎప్పుడు: సెప్టెంబర్, 2016
ఎక్కడ: ఉరి, బారాముల్లా జిల్లా
ఏమైంది: ఆర్మీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి చేసిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు
నష్టం: అమరులైన 19 మంది జవాన్లు
దాడి: నాగ్రోటా ఎటాక్
ఎప్పుడు: నవంబర్, 2016
ఎక్కడ: నాగ్రోటా, జమ్ము జిల్లా
ఏమైంది: ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి
నష్టం: అమరులైన 7 మంది జవాన్లు
దాడి: అమర్నాథ్ యాత్రపై దాడులు
ఎప్పుడు: జూలై, 2017
ఎక్కడ: అనంత్‌నాగ్ జిల్లా
ఏమైంది: అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న పర్యాటకుల బస్సుపై ఉగ్రదాడులు
నష్టం: 8 మంది పౌరుల మృతి
దాడి: రియాసీ ఎటాక్
ఎప్పుడు: జూన్, 2024
ఎక్కడ: రియాసీ జిల్లా
ఏమైంది: యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి
నష్టం: 9 మంది పౌరుల మృతి
దాడి: ఎర్రకోట దగ్గర కారు పేలుడు
ఎప్పుడు: నవంబర్ 10, 2025
ఎక్కడ: ఢిల్లీ
ఏమైంది: కారులో భారీ పేలుడు
నష్టం: 9 మంది మృతి
ఎప్పుడు: ఫిబ్రవరి, 2019
ఎక్కడ: పుల్వామా జిల్లా
ఏమైంది: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల దాడి
నష్టం: అమరులైన 40 మంది జవాన్లు, 35 మందికి గాయాలు
ఎప్పుడు: ఏప్రిల్, 2025
ఎక్కడ: పహల్గాం, అనంత్‌నాగ్ జిల్లా
ఏమైంది: పర్యాటకులపై దాడి చేసిన లష్కరే తొయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు
నష్టం: 26 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు