లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లోని వివిధ అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాషాయ కూటమికి భంగపాటు ఎదురైంది. అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేసింది. ఇండియా కూటమి 11 అసెంబ్లీ స్ధానాల్లో గెలుపొందగా, బీజేపీ కేవలం 2 స్ధానాలతో సరిపెట్టుకుంది.
అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై బిహార్‌లోని పుర్నియా ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ స్పందించారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 11 స్దానాల్లో విజయం సాధించిందని, ఇది కేవలం విపక్ష కూటమికి దక్కిన విజయంగానే చూడరాదని అన్నారు. హరియాణ, జార్ఖండ్, మహారాష్ట్రలో ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఇది సంకేతమని చెప్పారు. కాషాయ కూటమికి ఉప ఎన్నికల ఫలితాలు గట్టి షాక్‌ను ఇచ్చాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విద్వేష రాజకీయాలను ప్రభోదించదని, లోక్‌సభ ఎన్నికల అనంతరం విపక్షాలకు ఈ ఫలితాలు నైతిక స్ధైర్యం ఇచ్చాయని చెప్పుకొచ్చారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో జరిగినఅసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలపై విపక్ష ఇండియా కూటమిలో జోష్ నెలకొంది. మోదీ సర్కార్ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇవి అద్దం పట్టాయని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పేర్కొంటున్నారు. ఇదే ఊపుతో జార్ఖండ్, హరియాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు రాబడతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Read More :
PM Modi | ట్రంప్‌పై దాడిపట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన