న్యూఢిల్లీ : కొవిడ్-19 సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినవారికే కాకుండా, అనాథ పిల్లలందరికీ పీఎం కేర్ ఫండ్ సహా ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ‘
కొవిడ్ సమయంలో అనాథలుగా మారిన పిల్లలకే కాదు.. ఇతర అనాథ పిల్లలకు కూడా పీఎం కేర్ ఫండ్ సహా, ఇతర పథకాలను వారికి వర్తింపజేయవచ్చు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. విద్యా హక్కు చట్టం, 2009 సెక్షన్ (2) కింద, ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేయటం ద్వారా అనాథ పిల్లలందరికీ కొవిడ్-19 పథకాల లబ్ధిని వర్తింపజేయాలని ధర్మాసనం సూచించింది.