Gold Price | బెంగళూరు, మార్చి 12 : కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడిన అనంతరం దుబాయ్ పసిడిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దుబాయ్లో బంగారం అంత చవకా? అని నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. వాస్తవానికి బంగారం అతి తక్కువ ధరకు లభించే దేశాల్లో దుబాయ్ ఆరో స్థానంలో ఉంది. దుబాయ్ కన్నా చవకగా బంగారం లభించే దేశాలు దానికన్నా ముందు ఐదు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం విదేశాలలో పుత్తడి ధర చవకగా ఉంది కదా అని దానిని ఇష్టం వచ్చినట్టు పెద్దమొత్తంలో మన దేశంలోకి తీసుకు రావడానికి నిబంధనలు అనుమతించవు. ఒక వేళ తెచ్చుకున్నా వాటిపై నిబంధనల మేరకు దిగుమతి సుంకం ఆరు నుంచి పది శాతం చెల్లించాలి.