ముంబై: వ్యాపారవేత్తలు, ఇతరులను ఐపీఎస్ అధికారిణి భర్త మోసం చేశాడు. రూ.7.42 కోట్ల ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ ఐపీఎస్ అధికారిణి భర్త ఇప్పటికే మరో కేసులో అరెస్టయ్యాడు. (IPS Officer’s Husband Arrested) మహారాష్ట్ర ఐసీఎస్ అధికారిణి రష్మీ కరాండికర్ భర్త, పురుషోత్తం చవాన్ పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారితోపాటు ఇతరులను రూ.7.42 కోట్ల మేర ఆయన మోసగించాడు. ప్రభుత్వ కోటా కింద ప్లాట్లను రాయితీ రేటుకు అమ్ముతానని నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. అలాగే మహారాష్ట్ర పోలీస్ అకాడమీకి టీ షర్టులు సరఫరా చేసే కాంట్రాక్టు పొందడానికి వ్యాపారవేత్తకు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు పురుషోత్తం చవాన్‌ను బుధవారం అరెస్ట్ చేశారు.
కాగా, ఐసీఎస్ అధికారిణి రష్మీ కరాండికర్ భర్త పురుషోత్తం చవాన్ దీనికి ముందు మరో ఆర్థిక మోసానికి పాల్పడ్డాడు. ముంబై, థానే, పూణేలలోని ప్రభుత్వ కోటా ఫ్లాట్లను రాయితీ ధరలకు అమ్ముతానని పలువురికి హామీ ఇచ్చాడు. అనేక మందిని రూ.24.78 కోట్ల మేర మోసగించాడు. ఈ ఆర్థిక మోసానికి సంబంధించిన ఈ కేసులో గత నెలలో పోలీసులు పురుషోత్తం చవాన్‌ను అరెస్ట్ చేశారు. అయితే తాజా కేసుపై విచారణ కోసం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.
Also Read:
Train- Inspection Trolley Collison | రైల్వే ట్రాలీని ఢీకొట్టిన రైలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు