Maoists Surrender | పోలీసుల ఎదుట లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు
Maoists Surrender | సుమారు 12 మంది మావోయిస్టులు (Maoists Surrender) పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ ఆయుధాలను సరెండర్ చేశారు. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్ట్ మిసిర్ బెస్రా గ్రూప్‌కు చెందిన వారు లొంగిపోయినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
రాంచీ: సుమారు 12 మంది మావోయిస్టులు (Maoists Surrender) పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ ఆయుధాలను సరెండర్ చేశారు. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్ట్ మిసిర్ బెస్రా గ్రూప్‌కు చెందిన వారు లొంగిపోయినట్లు పోలీస్ అధికారి తెలిపారు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్ అటవీ ప్రాంతమైన సరందా, కోల్హాన్‌లో మావోయిస్టులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన 12 మంది మావోయిస్టులు భద్రతా సిబ్బంది ముందు లొంగిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి గురువారం తెలిపారు. తలపై కోటి రివార్డ్ ఉన్న మిసిర్ బెస్రా బృందంలోని మావోయిస్టులు సరెండర్ అయ్యారని చెప్పారు.
కాగా, మావోయిస్టుల కంచుకోట అయిన జార్ఖండ్‌లోని సింగ్భూమ్ లోక్‌సభ స్థానంలో మే 13న పోలింగ్ జరుగనున్నది. సుమారు దశాబ్ద కాలంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్న అంతర్గత ప్రాంతాల ప్రజలు తొలిసారి ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికల బృందాలు, పోలింగ్ సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

