న్యూఢిల్లీ : విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు సోషల్ మీడియాలో (viral video) తరచూ కనిపిస్తుంటాయి. వెరైటీ ఫుడ్ కాంబినేషన్లపై నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుండగా విచిత్రమైన ఫుడ్ కాంబోలపై పలువురు పెదవివిరుస్తున్నారు. ఇక లేటెస్ట్ వైరల్ వీడియోలో ఓ వీధి వ్యాపారి బనానా పానీపూరి విక్రయిస్తుండటం కనిపించింది.
Hurting the food sentiments of Pani Puri lover’s on the TL
Presenting Banana Chana Pani Puri🙈 pic.twitter.com/961X9wnuLz
— Mohammed Futurewala (@MFuturewala) June 22, 2023
ఈ వీడియోలో స్ట్రీట్ ఫుడ్ వెండర్ కొత్తిమీర, స్పెసెస్, పచ్చిమిర్చి, శనగలను అరటిపండ్లతో మిక్స్ చేయడం కనిపిస్తుంది. ఆలూ స్ధానంలో పానీపూరిలో బనానాను నింపడం చూడొచ్చు. ఈ వీడియోను మహ్మద్ ఫ్యూచర్వాలా ట్విట్టర్లో షేర్ చేశారు. బనానా చనా పానీపూరి సమర్పిస్తున్నామని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ టేస్టీ అని ఓ యూజర్ కామెంట్ చేయగా ఇదేం ఫుడ్ కాంబినేషన్ అంటూ పలువురు నెటిజన్లు పెదవివిరిచారు.
Read More :