న్యూఢిల్లీ : పదహారు రోజుల పాటు కోమాలో ఉన్న కొడుకు కన్ను తెరవగానే అప్పటివరకూ తల్లడిల్లిన తల్లి హృదయం (Viral Video) తేలికపడింది. గుయ్ అనే బాలుడు పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ బులోసా అనే అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రం కావడంతో బాలుడు 16 రోజుల పాటు కోమాలోకి వెళ్లాడు. ఆపై చిన్నారి స్ప్రహలోకి రాగానే ముందుగా తన తల్లిని చూడాలనుకున్నాడు.
వారిద్దరూ ఒకరికొకరు ఎదుటపడగానే భావోద్వేగానికి లోనై కంటతడితో హగ్ చేసుకున్నారు. కొడుకు స్ప్రహలోకి వచ్చాడని తెలుసుకున్న తల్లి ఆస్పత్రికి పరుగున వచ్చి బాలుడి వద్దకు వెళ్లింది. తల్లిని చూసిన బాలుడు ఉద్వేగంతో బోరున విలపించగా ఆమె సైతం కన్నీరొలికింది. గుడ్న్యూస్ మూమెంట్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది.
బాబు ఆరోగ్యం గాడినపడి అతడు సత్వరమే కోలుకోవాలని ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆకాంక్షించారు. తీవ్ర న్యుమోనియాతో బాలుడు బాధపడుతున్నాడు.. అందుకే అతడు కోమాలోకి వెళ్లాడు…ఇన్ని రోజులు బాలుడిని అంటిపెట్టుకుని తల్లి ఉండగా ఆమె ఇంటికి వెళ్లిన రోజే బాబు స్ప్రహలోకి వచ్చాడని మరో యూజర్ రాసుకొచ్చారు.